తెలంగాణ:పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్సీ) టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.
ఆసక్తి,అర్హత గల అభ్యర్థులు జులై 10 నుంచి 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.బి.ఆర్క్,బీఈ/బీటెక్ (సివిల్),బీ.ప్లానింగ్/బీ.
టెక్ (ప్లానింగ్),ఎంఏ (జాగ్రఫీ),ఎంఎస్సీ(జాగ్రఫీ) లేదా ఎంఎస్సీ (జియోఇన్ఫర్మేటిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.పరీక్ష అక్టోబర్ 2026లో (తాత్కాలికం) నిర్వహిస్తోంది.

