కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ప్రతిపక్ష టీం నేతలపై దాడుల పర్వం కొనసాగుతోంది. ఇటీవలే ఎమ్మెల్యే మదన్ మిత్ర, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా టీసీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌పై కోడి గుడ్లతో చేశాడో. సోమవారం (జూన్ 15) పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నివాసం నుంచి కునాల్ ఘోష్ బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
చందన్ అనే స్థానిక యువకుడు ఈ దాడికి తానే బాధ్యుడని ప్రకటించుకున్నాడు. ఈ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన చందన్ దాడిని సమర్థించుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు టీ నేతలు సామాన్య ప్రజలపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నాడు. కునాల్ ఘోష్ కూడా తక్కువేమీ కాదన్నాడు. టీఎంసీ మాకు చాలా అన్యాయం చేసిందని.. ఈ దాడులకు వాళ్లు అర్హులేనన్నారు. ఏకంగా మమత బెనర్జీ ఇంటి ముందే టీఎంసీ సీనియర్ నేతపై దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీఈ ఇప్పటి వరకు స్పందించలేదు.
►ఇంకా చదవండి | కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై దాడి.. చెంప చెల్లుమనిపించిన దుండగులు

