ఓవల్ (లండన్): మహిళల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ చేరుకుంది. మంగళవారం జరిగిన ఆస్ట్రేలియా తొలి సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడింటి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన డాటిన్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గార్డ్నర్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 13 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన విజయాన్ని అందుకుంది. బెత్ మూనీ 61 (నాటౌట్) జట్టును గెలిపించింది.

