ముంబై: రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న టెట్ క్వాశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంపై మహారాష్ట్ర రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు సమగ్ర విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం (జూన్ 27) ఆదేశాలు జారీ చేశారు. థానే జాయింట్ సీపీ పంజాబ్రావ్ ఉగాలే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసును విచారించనుంది.
మరోవైపు.. సీఎం ఫడ్నవీస్ టెట్ క్వశ్చన్ పేపర్ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే, డీజీపీ సదానంద్ డేట్లతో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని.. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అసలేం జరిగిందంటే..?
2026, జూన్ 28 (ఆదివారం) మహారాష్ట్రలో టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావటం, ఆందోళనలు మొదలవడంతో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ప్రకటించింది.
ఈ పరీక్ష కోసం వెయ్యి 28 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ అవసరమైన పరీక్షకు ఒకరోజు ముందు క్వశ్చన్ పేపర్ లీకైనట్లు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పరీక్షను వాయిదా వేసినట్లు నిర్ణయించారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రైడ్ చేసిన బివండీ పోలీసులు.. TET 2026 పరీక్ష పేపర్లకు సంబంధించిన సీల్డ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పరీక్షకు 24 గంటల ముందే టెట్ పేపర్లు థానే ఏరియాలో సర్కిలెట్ అయినట్లు ప్రచారం జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రైడ్స్ నిర్వహించి సీల్డ్ పేపర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 4.28 లక్షల మంది హాజరవుతున్న టెట్ పరీక్ష వాయిదా పడడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి రీషెడ్యూల్‌ను త్వరలోనే విడుదల అధికారులు ప్రకటించారు.
టెట్ క్వశ్చన్ పేపర్ లీక్ అంశంపై మహారాష్ట్ర స్టేట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కోరనే ప్రశ్నపత్రం కాపీలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బీహార్, హర్యానాలకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు.
పేపర్ లీకేజ్‌పై కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు విమర్శలకు దిగారు. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని.. మహారాష్ట్రలో ఫడ్నవీస్ నేతృత్వంతో బీజేపీ సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు.

