– ప్రకటన –
జయప్రదానికి వామపక్షాల పిలుపు
నిర్ణయాన్ని వెనక్కు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులెట్ వద్ద ఒక ప్రధాన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై లెప్ట్ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి నిరసనగా సోమవారం బషీర్‌బాగ్‌లోని బాబూజగ్జీవన్‌రాం విగ్రహం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయా పార్టీలు ఒక ప్రకటన విడుదల చేశాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి అమెరికా సామ్రాజ్యవాదం ప్రజల మీద యుద్ధాలను రుద్దుతున్నదని పేర్కొన్నారు. ప్రజల రక్త మాంసాలను అది పీల్చి పిప్పి చేస్తున్నదని విమర్శించాయి. మన మీద ట్రంప్ ఆంక్షలు విధించిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి మోడీ సహకారంతో దేశం నష్టపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశాయి.
– ప్రకటన –

