డీకే శివకుమార్ రాజకీయ ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఆర్థికంగా బలవంతుడు. ఆలోచనలో ఉన్నత వంతుడు. పైగా అనేక సంక్షోభాలలో పార్టీని గట్టెక్కించాడు. పైగా సోనియాగాంధీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అందుకే అంతటి సిద్ధరామయ్యను కూడా పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది.
శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అంతా సానుకూలంగా ఉంటుందని.. మంత్రులు.. మిగిలిన ఎమ్మెల్యేలు మొత్తం సహకరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించిన ఒక్కరోజు వ్యవధిలోనే కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తన కోరుకున్న శాఖ రాలేదని రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేశారు. తన కోరుకున్న శాఖ ఇవ్వలేదని మరో మంత్రి మునియప్ప నిరసన తెలిపారు. తనకు చెప్పకుండా అధికారులను మార్చారని ఇంధన మంత్రి జార్జ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. పీసీసీ పగ్గాలు తనకు అప్పగించలేదని మరొక మంత్రి సతీష్ అలక పాన్పు ఎక్కారు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. తమిళనాడులో ఐదు స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. విజయ్ పార్టీకి అవసరం కాబట్టి కాంగ్రెస్ పరువు నిలబడింది. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా మారిపోతుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను మొత్తం శాసించిన హస్తం పార్టీ ఇప్పుడు ఇలా మారిపోవడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.
దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక అత్యంత కీలకమైనది. ఈ రాష్ట్రం మీద బిజెపి అధినాయకత్వం ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటోంది. వాస్తవానికి బిజెపికి దక్కకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయాలు చేయవలసి ఉంది. కానీ సిద్ధకుమార్రామయ్య.. డీకే శివ మధ్య ఆధిపత్య పోరు వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
అనేక రకాల చర్చల తర్వాత శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ మంత్రులు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం.. రాజీనామా చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా మారింది. అంతటి ట్రబుల్ షూటర్ డీకే కూడా తలనొప్పితో బాధపడుతున్నాడు అంటే కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

