OnePlus N6x: భారత్‌లో కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్ కావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. కానీ దీని బ్యాటరీ గురించి అప్పుడే చెప్పింది. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది మొబైల్ యూజర్స్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. రోజూవారి ఫోన్ వినియోగం పెరుగుతుండడంతో దీని అవసరం పెరుగుతోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేకంగా కొత్త ఫోన్ ను తీసుకురాబోతుంది. మరి ఇది ఏ ఫోన్? ఇందులో ఉండే బ్యాటరీ బ్యాకప్ ఎంత?
సాధారణంగా ప్రతీ మొబైల్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. కానీ OnePlus నుంచి కొత్తగా రాబోతున్న N6x మొబైల్లో ఊహించని బ్యాటరీని చేర్చారు. ఇందులో ఏకంగా 7000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజులకు పైగా వాడుకోవచ్చు. మార్కెటింగ్‌లో ఉద్యోగులు, నిత్యం ఫోన్‌తో ఉండే వారికి ఈ బ్యాటరీ బ్యాకప్ బాగా యూజ్ అవుతుంది. అదనంగా ట్రావెల్ చేసే వారికి ఇది ఉత్తమ ఎంపిక అని అంటున్నారు.
ఈ బ్యాటరీ ఫుల్ చార్జీ అయిన తరువాత 20.56 గంటల పాటు వీడియో ప్లే బ్యాక్ ఉంటుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ కు 25.04 గంటల బ్యాకప్ ఇస్తుంది. మ్యూజిక్ ప్లే కోసం 133.56 గంటలు, వీడియో రికార్డింగ్ కోసం 11.26 గంటల పాటు ఉపయోగించవచ్చు. అలాగే ఫొటోగ్రఫీవారికి నిరంతర కాలింగ్ కోసం యూజ్ చేస్తే మరింత ఎక్కువ సమయం బ్యాటరీ ఉండే అవకాశం ఉంటుంది.
ఈ ఫోన్లో బ్యాటరీ కాకుండా ఇతర ఫీచర్లు కూడా కట్టుకుంటున్నాయి. దీని వెనుక ప్లాట్ ప్యానెల్ డిజైన్ ఉండనుంది. ఇది పిల్ ఫేస్ కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంది. హెడ్ ఫోన్ ఉపయోగించేవారికి 3.55 ఆడియో జాక్ సదుపాయాన్ని ఇచ్చారు. వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ మొబైల్ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. వీటిలో ఒకటి బర్గుండీ రెడ్, ఐస్ బ్లూ.
ఈ ఫోన్ 31న భారత్ లో విడుదల కావాల్సి ఉంది. ఆ తరువాత దీనిని అమెజాన్, వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్ సైట్లలో కొనుగోలు చేయొచ్చు. రూ. 20,000 లోపు ఈ మొబైల్ ధర ఉండే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా బ్యాటరీ కోసం చూస్తారు. అలాంటి వారి కోసం ఇది మంచి ఫోన్ అని టెక్ నిపుణులు అంటున్నారు.

