హైదరాబాద్: రాజేందర్ నగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి వద్ద గల సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన సంఘటన వెలుగు చూసిన విషయం విధితమే. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఆదివారం మోతీ నగర్ లోని బంధువు ఇంటికి రావడం జరిగింది. అనంతరం ఉదయం విషం తాగి ఆత్మహత్నాయత్నానికి హాజరయ్యారు. బంధువులు గమనించి ఉదయ్ ను ఆసుపత్రికి చేరుకున్నారు. ఎస్ ఆర్ నగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. తనపై వచ్చిన ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తవమంటూ పోస్టు పెట్టారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని..న్యాయం తప్పకుండా గెలుస్తుందని అన్నారు.

