దేశం మొత్తం ప్రభంజనాలు సృష్టిస్తున్నప్పటికీ దక్షిణాదిన మాత్రం బిజెపి ఎత్తుగడలు సాగడం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వాలలో భాగస్వామిగా మిగిలిన రాష్ట్రాలలో ఆ పార్టీ వ్యూహాలు ఎదురు తిరుగుతున్నాయి. కేవలం కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, గతంలో రెండు సార్లు అధికారంలోకి రావడంతో వచ్చే ఎన్నికలలో మళ్లీ అధికారం చేపట్టగలమనే భరోసా వస్తోంది. అయితే, ఎన్నికలకు రెండేళ్లకు ముందే కాంగ్రెస్ ఎటువంటి హడావుడి లేకుండా సామరస్యంగా ముఖ్యమంత్రిని మార్చడం, డికె శివకుమార్‌ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం బిజెపిలో ఖంగారు సృష్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా వచ్చే ఎన్నికలలో కర్ణాటకలో మళ్లీ మరోమారు అధికారంలోకి రాగలమనే ఆశలు వమ్ముకావచ్చనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. సిద్ధరామయ్య మాదిరిగానే శివకుమార్‌కు పరిపాలనపై పట్టుబడింది. ఇప్పటివరకు నిరూపితం కాలేదు. అయితే, ధనబలంతోపాటు కండబలం కూడా కలిగిన వ్యక్తిగా పేరొందడంతో ఆయనను ఎదుర్కోవడం ఇబ్బందులకు గురిచేయవచ్చనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే బిఎస్ యడ్డ్యూరప్ప తర్వాత ప్రజలలో పలుకుబడి గల నాయకుడిని బిజెపి కనుగొనలేకపోతుంది. పైగా, పార్టీ నేతలలో అనేక వర్గాలు, కలహాలు పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకనే గత వారం నాలుగు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులను నియమించినా కర్ణాటకకు నియమించలేకపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినప్పటి నుండి బిజెపి జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేస్తోంది. మొత్తంమీద బిజెపి ఇంకా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎంపిక చేయవలసింది కర్ణాటకలోనే ఉండటానికి దేశం. కీలకమైన పార్టీలో జాతీయ సంస్థాగత ప్రధాన బిఎల్ సంతోష్ స్వరాష్ట్రం కర్ణాటక కావడం, రాష్ట్రంలో పార్టీలో కుమ్ములాటలకు ఆయననే కేంద్రబిందువుగా భావించడంతోపాటు పార్టీ తొందరపడి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడటం లేదు. శివకుమార్ బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కావడం, దేశం మొత్తం మీద సంపన్నుడైన ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు బిజెపిలోని నాయకులతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. పైగా, ఆర్ఎస్ఎస్లోని ప్రముఖులతో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉంది. అందుకనే బిజెపిలో కుమ్ములాటలు తీవ్రమైతే వాటిని కాంగ్రెస్‌కు సానుకూలంగా శివకుమార్ ఉపయోగించుకునే అవకాశం లేదని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
వాస్తవానికి కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికోసం దీర్ఘకాలం పాటు శివకుమార్‌ను బిజెపిలో చేరితే ముఖ్యమంత్రిగా చేస్తామంటూ చాలాకాలంగా ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనపై సోదాలు జరిపిన మొత్తం సిబిఐ, ఇడి అధికారులు ‘మీరు బిజెపిలో చేరితే మాకు ఈ విధంగా తరచూ దాడులు జరగవు’ అంటూ స్పష్టమైన సంకేతం ఇచ్చారని తెలుస్తోంది. ఆయన అరెస్ట్‌కు కూడా సిద్ధపడ్డారు గాని బిజెపి వలలో చిక్కుకొనేందుకు ఇష్టపడలేదు. 2019లో ఇడి అరెస్ట్ సమయంలో జైలుకు వెళ్లి స్వయంగా సోనియా గాంధీ ఆయనను పరామర్శించారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన చిదంబరంతో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఎవ్వరినీ ఆమె ఆ విధంగా పరామర్శించకపోవడం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాలలో ఎక్కడా బిసి ముఖ్యమంత్రి లేకపోవడంతో గుర్తింపుపొందిన బిసి నేత, సుదీర్ఘ పరిపాలన అనుభవం కలిగిన సిద్ధరామయ్యను మార్చేందుకు రాహుల్ గాంధీ సందేహం, సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా పట్టుబట్టి శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించారు.
తనకున్న ఆర్థిక అండదండలతో వ్యవస్థలను ‘మానేజ్’ చేయడంలో బిజెపి నాయకులకు ఆయన ఏమాత్రం తీసిపోరనే ప్రచారం కూడా ఉంది. పైగా, కర్ణాటకలో రాజకీయంగా బలమైన వర్గంగా పేరొందిన, జనాభాలో 10 శాతం వరకు ఉన్న వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఆ వర్గంలో మంచి పట్టుకూడా ఉంది. బిజెపి ఎక్కువగా 11 శాతం పైగా ఉన్న లింగాయత్‌ల మద్దతుపై ఆధారపడుతుంది. అయితే, యడ్డ్యూరప్ప తర్వాత ఆ సామాజిక వర్గంపై పూర్తిగా పట్టుగల నేతలు బిజెపిలో లేరు. ప్రస్తుతం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న యడ్డ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు ఇంకా ఆ సామాజిక వర్గంపై చెప్పుకోదగిన పట్టులేదు. పైగా, ఆయనకు పార్టీలోనే కీలకమైన నేతల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయనను ఆ పదవిలో కొనసాగిస్తూ పార్టీ అధిష్టానంపై పలు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. మరో లింగాయత్ నాయకుడు, బసనగౌడ పాటిల్ యత్నాల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దారితీసినందుకు ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించారు.
కాంగ్రెస్‌కు ఒక వొక్కలిగ నాయకుడు నాయకత్వం వహించడం, లింగాయత్‌లలో తమ మద్దతును పటిష్టం చేసుకోవాలని పార్టీ చూస్తున్న తరుణంలో, కర్ణాటకలో బిజెపికి నాయకత్వం వహించే విజయేంద్ర అవకాశాలు మెరుగుపడినట్లు అనేక పార్టీ నాయకులు. అయితే, ఒక లింగాయత్ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం వల్ల, వాక్చాతుర్యం, ప్రసిద్ధి పొందిన వొక్కలిగ నాయకురాలు అయిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. నిర్భయత్వానికి పేరుగాంచిన కరంద్లాజే ‘యడ్యూరప్ప శిబిరం’ నుండి వచ్చినా ఇప్పుడు పార్టీలో పలు వర్గాల మద్దతు పొందుతున్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా 2023 బిజెపి ఎన్నికల పరాజయానికి ఆమెపై విస్తృతంగా నిందలు మోపుతున్నప్పటికీ, ఆమె రాజకీయ పలుకుబడి వల్ల ఆమెను అంత సులభంగా పక్కకు నెట్టలేరు.
కాగా, ఉత్తర కర్ణాటకలో మాజీ బిజెపి దిగ్గజాలైన ‘బళ్లారి సోదరులకు’ నిలయమైన ప్రాంతంతోపాటు కాంగ్రెస్‌కు సాంప్రదాయకంగా బలమైన పట్టు కలిగిన హైదరాబాద్- కర్ణాటక ప్రాంతం బిజెపికి సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఒకవేళ బిజెపి రాష్ట్రంలో ఒక యువ నాయకుడిని నియమించాలని నిర్ణయించుకుంటే, ప్రస్తుతం తమ ప్రాభవాన్ని కోల్పోతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభావం పాతతరం నాయకులతో ఘర్షణ అనివార్యం అవుతుంది. శివకుమార్ ముఖ్యమంత్రి కావడం బిజెపి మిత్రపక్షమైన జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి జాతీయ నాయకత్వంతో ఏర్పాటు చేసుకున్న మంచి సంబంధాలను ఆసరాగా చేసుకొని రాష్ట్ర బిజెపిలో వ్యతిరేకులు వచ్చే ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆయన పెట్టుకున్న ఆశలు వమ్మయిన్నట్లే అని చెప్పారు. ప్రస్తుతం కేంద్రవర్గంలో కొనసాగుతున్న ఆయన ఎన్‌డిఎ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వడానికి బిజెపి నాయకత్వాన్ని ఒప్పుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శివకుమార్ నాయకత్వంలో, వొక్కలిగ వర్గానికి చెందిన కుమారస్వామికి వొక్కలిగ సమాజం మద్దతు పొందడం సాధ్యం కాదు. దానితో జెడిఎస్‌తో కొన్ని ప్రాంతాలలో తన బలం పెంచుకోవాలనే బిజెపి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉండదు. పైగా, శివకుమార్ ప్రభుత్వం ప్రభావంతో జెడిఎస్‌లో పలువురు నాయకులు, శ్రేణులు ఆ పార్టీకి దూరమై కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశం ప్రకటించారు కూడా బిజెపి నాయకులు.
మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిసి జనన జరిపిన సిద్దరామయ్య ఆ నివేదికను బహిరంగపరచలేదు. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో కొన్ని లోపాలున్నాయంటూ ఈ పర్యాయం మరో కమీషన్ ఏర్పాటు చేశారు. దాని నివేదిక గత ఏడాదే సిద్ధమైనా ఇప్పటివరకు బహిరంగపరచలేదు. మధ్యలో అధికారంలో ఉన్న బిజెపి, జేడీఎస్‌లు సహితం బిసి ప్రభుత్వం జోలికి వెళ్ళలేదు.వాటిని అమలు చేయాలంటే కర్ణాటక రాజకీయాలలో కీలకమైన, పుష్కలంగా వనరులు గల లింగాయత్, వక్కలింగ సామాజిక వర్గాల నుండి ఆగ్రవేశాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెనుకంజ వేశారు. సిద్దరామయ్య సహితం అదేకారణంగా వాటిని అమలు పరిచే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు పదవి నుండి దిగడం తప్పనిసరి కావడంతో టైం బాంబు’ వంటి ఆ నివేదికను ఆమోదించి రాబోయే ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేసారని చెప్పవచ్చు. కర్ణాటకలో అగ్రగామి వెనుకబడిన తరగతుల నాయకుడిగా తన ప్రతిష్టనుండి వైదొలగే ముందు పటిష్టంగా నిలబెట్టుకున్నట్లయింది. ఈ తరుణంలో నివేదికను స్వీకరించడం ద్వారా, దాని పర్యవసానాలను ఎదుర్కొనే భారం పూర్తిగా డీకే శివకుమార్‌పై పడేలా ఆయన చూసుకున్నారు. ఈ సంఖ్య తగ్గించబడిన తరగతులు, మైనారిటీల జనాభా వాటాను పెంచి, లింగాయతులు, వొక్కలిగల జనాభా బలాన్ని చూపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిని అమలు చేయబోతే బలమైన ఆ వర్గాల ఆగ్రవేశాలు ఎదుర్కొనక తప్పదు.

