విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి పక్కి రవీంద్రనాథ్ రచించిన “హా… హతవిధి” అనేకవితను డిగ్రీ మూడవ సెమిస్టర్లో బోధన నిమిత్తం
ఎంపికచేస్తూ తెలుగు పాఠ్యపుస్తక మండలి నిర్ణయించింది.సంపాదకులు సుంకర గోపాలయ్య కవి పక్కి రవీంద్రనాథ్ అనుమతిని కోరుతూ లేఖను పంపించారు. మూడవ సెమిస్టర్లో కవిత్వ నిర్మాణమునకు సంబంధించిన పాఠంలో రవినాథ్ద్ర కవితను చేర్చుతున్నట్లు ఆయన లేఖలో తెలిపారు.
రవీంద్రనాథ్ రచించిన నొయిడ నిఠారి కాల్వలో …అనుకవిత హిందీ అనువాదాన్ని గతంలో పుదుచ్చేరి ప్రభుత్వం డిగ్రీ విద్యార్ధులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది.
ఇతని రచన డిగ్రీ విద్యార్ధులకు పాఠ్యాంశముగా ఎంపిక కావడం పట్ల స్నేహకళాసాహిత్యానికి చెందిన రచయితలు గంటేడ గౌరునాయుడు, గడగమ్మ రామకృష్ణ, మల్లిపురం జగదీష్, చింత అప్పలనాయుడు, సిరికినాయుడు, చందనపల్లి స్వామిరావు మరియు పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు మంచిపల్లి శ్రీరాములు, బెహరా ఉమామహట్టిేశ్వరరావు, బెలగాంరాజు, బెహరా ఉమామహట్టిేశ్వరరావు, నారంశేశ్వరరావు శేషుతదితరులు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభినందనలు తెలియజేసారు. పలువురు ఉపాధ్యాయులు, అభిమానులు కూడా పక్కికు అభినందనలు తెలిపారు. గతంలో గంటేడ గౌరు నాయుడుకు సంబంధించిన కవితను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్యాంశంగా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పట్టణానికి చెందిన కవి సిరికి స్వామి నాయుడుకు చెందిన కవితను కూడా ఈ ఏడాది డిగ్రీలో పాఠ్యాంశంగా చేర్చిన సంగతి తెలిసిందే. పార్వతీపురం పట్టణానికి చెందిన ముగ్గురు రచయితల కవితలు డిగ్రీ తెలుగు బోధనా భాషలో చేర్చడం పార్వతీపురం జిల్లా కాక ఉత్తరాంధ్ర కే గర్వకారణమని పలు సాహిత్యాలు తెలిపాయి.

