KCR BJP: భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటుంది భారత రాష్ట్ర సమితి. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని.. హోం శాఖ మంత్రి అమిత్ షా ను తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. ఒక దశలో తన సొంత పత్రికలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయించేవారు. అయితే ఇప్పుడు సీన్ మారినట్టుగా. భారతీయ జనతా పార్టీ విషయంలో భారత రాష్ట్ర సమితి వైఖరి మారిపోయింది.
ప్రస్తుతం అన్ని చర్చలకు దారి తీసిన పార్లమెంటు నియోజకవర్గం ప్రక్రియపై రాజకీయ పార్టీలు వాటి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి ఒకరకంగా ట్విస్ట్ ఇచ్చింది. కెసిఆర్ సూచనల మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా ఒక ప్రకటన చేశారు. డీ లిమిటేషన్ బిల్ మీద ఇప్పటివరకు కెసిఆర్ ప్రతికూలమైన స్వరాన్ని వినిపించారు. ఇప్పుడు ఒకసారిగా గొంతు సవరించుకున్నారు. తన కుమారుడు కేటీఆర్ ద్వారా డీలిమిటేషన్ బిల్లుకు పార్టీ నుంచి జై కొడుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా తగ్గకుండా ఉండాలన్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో 24% వాటా ఉంది. దీనిని వచ్చే రోజుల్లో కూడా అదే విధంగా కొనసాగించాలి. ఇది డిమాండ్ ను కేటీఆర్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు విపరీతంగా అన్యాయం జరుగుతుందని గతంలో కేసీఆర్ అనేవారు. ఇప్పుడు అదే మాటను కేటీఆర్ కూడా అంటున్నారు. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అభివృద్ధి చెందుతున్నాయని.. అటువంటి రాష్ట్రాల మీద కేంద్రం డి లిమిటేషన్ పేరుతో కత్తి దూయకూడదని కేటీఆర్ చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగితే తాము తీవ్రంగానే ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు.
పార్లమెంట్లో ప్రస్తుతం 543 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రకారం సౌత్ స్టేట్స్ మొత్తం కలిపి 24 శాతం బాట కలిగి ఉంది. వచ్చే రోజుల్లో సీట్ల సంఖ్య యావ శాతం ఫార్ములా ప్రకారం పెరిగిపోతే.. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గదు. కేటీఆర్ అంటున్నట్టుగానే 24 శాతం వాటా ఉంటుంది. అలాంటప్పుడు కేటీఆర్హెచ్చరించడంలో అర్థం ఏముంది. దక్షిణ ఏర్పాటు చెందిన ప్రజల ప్రయోజనాలను కాపాడే బిల్లులో చేర్చాలని కేటీఆర్ అంటున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే డిలిమిటేషన్ బిల్లుకు గులాబీ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు . మరి ఇన్ని రోజులపాటు డీ లిమిటేషన్ బిల్లు మీద వ్యతిరేక వార్తలు రాసిన భారత రాష్ట్ర సమితి కరపత్రిక నమస్తే తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే. . అత్యంత బాధగా ఉంటుంది. పాపం..

