జననాయకన్ OTT విడుదల: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ చిత్రం థియేటర్లలో విడుదల అవ్వడం ఇక దాదాపుగా కష్టమేనా అంటే, అవుననే అంటున్నాయి తమిళ వర్గాలు. నేడే ఈ చిత్రం పైరసీ చేసిన ప్రధాన నిందితుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది , కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ మాత్రం రావడం లేదు. నిర్మాతలు సెన్సార్ సభ్యులు చెప్పిన మార్పులు చేర్పులు చేసి, ఫైనల్ ఎడిట్ ని వాళ్లకు పంపడానికి కూడా, వాళ్ళు సెన్సార్ చేయడం లేదు. ఇందులో రాజకీయ కచ్చితంగా కుట్ర దాగి ఉందని అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇప్పుడు విజయ్ ఏకంగా తమిళనాడు రాష్ట్రానికి , ఆయన తలుచుకుంటే సెన్సార్ చేయించడం ఎంత పని అని ముఖ్యమంత్రి అంటుంటారు కానీ, సెన్సార్ బోర్డు రాష్ట్ర పరిధి లోకి రాదు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. తమిళనాడు లో ఎన్నికల ముందు బీజేపీ పార్టీ , టీవీ ఒప్పుకోని పొత్తుకు ఆహ్వానించిందని , కానీ టీవీకే ఎందుకు ఒప్పుకోలేదని , ఎన్ని రకాల ఒత్తిడి తీసుకు వచ్చింది , విజయ్ ఒప్పుకోలేదని , ఆయన్ని ఆర్థికంగా దెబ్బ తీసేందుకు ‘జన నాయకన్ ‘ ఈ సెన్సార్ ద్వారా అడ్డుకున్నారని విజయ్ ఫ్యాన్స్ వాదన వినిపిస్తోంది. వాళ్ళ వాదనలో కూడా లాజిక్ ఉంది. వాస్తవానికి ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని, సెన్సార్ ఇక్కట్లు తొలగిపోతాయని ఆ చిత్ర నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. కానీ సెన్సార్ మొండితనం చూస్తుంటే , ఈ చిత్రం క్లియరెన్స్ ఇవ్వడానికి అసలు ఆసక్తి చూపుతున్నట్టుగా అనిపించడం లేదు. అందుకే మేకర్స్ ఈ నేరుగా ఓటీటీలోకి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు.
ఓటీటీ కి ఎలాంటి సెన్సార్ అవసరం లేదు కాబట్టి , ఈ నిర్మాణానికి ఫైనాన్షియర్స్ వద్ద తీసుకున్న డబ్బులకు వడ్డీలు నెలనెలా విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి , డైరెక్ట్ ఓటీటీ లోనే విడుదల చేయడానికి నిర్మాతలు చూస్తున్నారని టాక్. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో చర్చలు కూడా మొదలు పెట్టారట. నిర్మాతలు దాదాపుగా అమెజాన్ ప్రైమ్ సంస్థ నుండి 275 కోట్ల రూపాయిలు ఆశిస్తున్నట్లు. సీఎం అయ్యాక విజయ్ నుండి వస్తున్న మొదటి చిత్రం , ఆయన చివరి చిత్రం కూడా అవ్వడంతో , వేరే లెవెల్ లో లాభాలు వస్తాయి కాబట్టే, ఈ రేంజ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

