- రేపు ట్రంప్ 80వ బర్త్ డే
- వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
- భారీగా ఖర్చుగా వార్తలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈసారి బర్త్ డే వేడుకలు స్పెషల్‌గా నిర్వహించేందుకు వైట్‌హౌస్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జూన్ 14న నిర్వహించే రాత్రి ఈవెంట్‌కు దాదాపు రూ.500 కోట్లు ఖర్చుగా చూపించారు.
ఇక ట్రంప్ పుట్టినరోజును పురస్కరించుకుని వైట్‌హౌస్ దగ్గర అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ ఫ్రీడమ్ 250 ఈవెంట్‌గా ఉన్నారు. ఇందు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. పలు దేశాలకు చెందిన ఫైటర్లు ఇందులో పాల్గొననున్నారు. ఒకవైపు ట్రంప్ బర్త్ డే వేడుకలు.. ఇంకోవైపు ఛాంపియన్షిప్ క్రీడలతో వైట్‌హౌస్ కళకళలాడుతోంది. ఈ వేడకను ”అమెరికన్ పోరాట స్ఫూర్తికి తరంలో ఒక్కసారే వచ్చే వేడుక.” అని వైట్‌హౌస్ అభివర్ణించింది. ఇక అమెరికా 250 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడం 250 అని ఈవెంట్‌కు పేరు పెట్టారు.
రెండోసారి ట్రంప్ వచ్చారు. అయితే ఈసారి చాలా దూకుడుగా వెళ్తున్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించారు. ఇక ఏడాది ప్రారంభంలో వెనిజుల అధ్యక్షుడు మధును కిడ్నాప్ చేశారు. ఇక ఇరాన్‌పై యుద్ధం ప్రకటించింది. ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా ట్రంప్ వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సుకు కూడా హాజరు కాబోతున్నారు.

