మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం:: డ్వాక్రా మహిళలకు డిజిటల్ పొదుపు, భద్రతపై అవగాహన కల్పించడం మునిసిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ భాస్కర్, టౌన్ మిషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం వారు పట్టణంలోని 43 నందు గల డ్వాక్రా సంఘాల మహిళలు పొదుపు చేస్తున్న నగదు డిజిటల్ పద్ధతిలో మొబైల్ నందు భద్రపరిచే విధంగా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన ప్రత్యేక యాప్ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రతి మహిళ సంఘంలోని ప్రతి సభ్యురాలు ఈ యాప్ను వినియోగించుకోవాలని కోరుతున్నారు. డిజిటల్ లావాదేవీలకు మహిళలు అలవాటు పడాలని తెలిపారు. ప్రత్యేక యాప్ను ప్రతి సభ్యురాలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా మహిళలకు యాప్ డౌన్లోడ్ విధానము ,వినియోగము, డిజిటల్ లావాదేవీలు, భద్రత, పొదుపు సొమ్ము నిర్వహణపై మెప్మా సిబ్బంది కూడా వివరించడం జరిగింది. మహిళల ఆర్థిక సాధికారతకు, సాంకేతికతను చేరువచేయుటలో ఈ యాప్ కీలకంగా నిలుస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, ఆర్పీలు మహిళలు ఉన్నారు.
పోస్ట్ డ్వాక్రా మహిళలకు డిజిటల్ పొదుపు, భద్రతపై అవగాహన.. మొదట కనిపించింది విశాలాంధ్ర.

