- భారత్‌లో కొనసాగుతోన్న మార్కో రూబియో పర్యటన
- సేవా తీర్థంలో ప్రధాని మోడీతో సమావేశం
- వైట్‌హౌస్‌ను సందర్శించండి
- ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం కోల్‌కతాలో పర్యటన ప్రారంభం కాగా.. అనంతరం ఢిల్లీ చేరుకుని సేవా తీర్థంలో ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. గంటకుపైగా మోడీతో రూబియో సమావేశం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌ను సందర్శించాలని అధ్యక్షుడు ట్రంప్ తరపున మోడీని రూబియో ఆహ్వానించారు. సమీప భవిష్యత్తులో ట్రంప్‌ను కలవాలని. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని భారత్‌లో అమెరికా రాయబారి అయిన సెర్గియో గోర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా మండలి సలహాదారు అజిత్ దోవల్, సెర్గియో గోర్‌తో సహా కీలక అధికారులు ఉన్నారు.
ఇక భేటీ వివరాలను మోడీ ఎక్స్‌లో పంచుకున్నారు. ”అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి. ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించి మేము చర్చించాము. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్-అమెరికా దేశాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగుతుంది.” అని పేర్కొన్నారు.
అలాగే భేటీకి సంబంధించిన వివరాలను సెర్గియా గోర్ ఎక్స్‌లో ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ”ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో రూబియోతో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. భద్రత, వాణిజ్యం, సాంకేతికత రంగాల్లో అమెరికా-భారత సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము ఫలప్రదమైన చర్చలు జరిపాము. ఈ చర్చలు రెండు దేశాలను పటిష్టం చేయడంతో పాటు, స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంత ప్రారంభానికి దోహదపడతాయి. అమెరికాకు భారతదేశం అత్యంత కీలకమైన భాగస్వామి!.”గా పేర్కొన్నారు.
ఇక శనివారం ఉదయం కోల్‌కతా చేరుకున్న మార్కో రూబియో అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి చేరుకుని ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక రంగాల్లో సహకారం వంటి అంశాలు ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.
అలాగే ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రక్షణ రంగ సహకారం పెంపు, ఇంధన భద్రత వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిణామాలపై కూడా ఇరు దేశాల అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
ఇక మార్కో రూబియో ఆదివారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమగ్ర చర్చలు జరపనున్నారు. అనంతరం సోమవారం ఆగ్రా, జైపూర్ నగరాల్లో మంగళవారం ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు.
గత కొంతకాలంగా భారత్-అమెరికా సంబంధాల్లో కొన్ని విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడం, హెచ్1బీ వీసా ఫీజుల పెంపు, అలాగే భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.
అయితే ఇటీవల రెండు దేశాల సంబంధాల మెరుగుదల కోసం చురుకైన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత నెల అమెరికాలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్మిశ్రీ మూడు రోజుల పాటు కీలక చర్చలు జరిపారు. అలాగే ఏప్రిల్ 14న ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్బంగా ద్వైపాక్షిక సంబంధాలలో సమాచారం సాధించినట్లు మోడీ తెలియజేసారు.
US సెక్రటరీ ఆఫ్ స్టేట్ Mr. మార్కో రూబియోను స్వీకరించడం సంతోషంగా ఉంది.
మేము భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో నిరంతర పురోగతి మరియు ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి మరియు భద్రతకు సంబంధించిన సమస్యల గురించి చర్చించాము.
భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ కలిసి పనిచేయడం కొనసాగిస్తాయి… pic.twitter.com/CuD0DdDXB7
– నరేంద్ర మోదీ (@narendramodi) మే 23, 2026
వార్తలు! అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున సెక్రటరీ మార్కో రూబియో ఆహ్వానం పంపారు, సమీప భవిష్యత్తులో ప్రధాని మోదీ వైట్‌హౌస్‌ను సందర్శించాలని! 🇺🇸🤝🇮🇳
— రాయబారి సెర్గియో గోర్ (@USAmbIndia) మే 23, 2026
చేరడం చాలా బాగుంది @SecRubio ప్రధానితో సమావేశం కోసం @నరేంద్రమోదీ. భద్రత, వాణిజ్యం మరియు క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలలో US-భారత్ సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై మేము ఉత్పాదక చర్చ చేసాము – మా రెండు దేశాలను బలోపేతం చేసే మరియు ఉచిత మరియు బహిరంగ ఇండో-పసిఫిక్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రాంతాలు.… pic.twitter.com/0bO3d7jYTa
— రాయబారి సెర్గియో గోర్ (@USAmbIndia) మే 23, 2026

