తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. పెద్ద కొడుకు యాత్రను హీరోగా పరిచయం చేయడానికి ధనుష్ రంగం సిద్ధం చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ధనుష్ తన దర్శకత్వంలోనే యాత్రను వెండితెరకు పరిచయం చేయబోతున్నారన్న సమాచారం నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్‌తో కలిసి ఆర్‌టేక్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. యాత్ర ఇప్పటికే నటన, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణల సమాచారం. తన వారసుడిని పర్ఫెక్ట్ లాంచ్ చేయడానికి ధనుష్ స్వయంగా టెస్ట్ షూట్‌ను ప్లాన్ చేస్తున్నారంటే, పక్కా ప్రణాళికతోనే రంగంలోకి దిగడం అర్థమవుతోంది.
►ఇంకా చదవండి | విజయ్ దేవరకొండ: ‘రణబాలి’లో హాలీవుడ్ విలన్ ఎంట్రీ.. కరువు రాక్షసుడుతో విజయ్ యుద్ధం!
యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించబడిన ఈ సినిమాలో యాత్రకు పవర్ఫుల్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండనున్నాయని కోలీవుడ్ టాక్. సంగీత బాధ్యతలను స్టార్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ చేపట్టనున్నాడని, విజువల్స్‌ను అద్భుతంగా మలిచే సినిమాటోగ్రాఫర్ వేల్రాజ్ కెమెరా బాధ్యతలు నిర్వహించబడుతున్నాయి.
ఇక ప్రస్తుతం ధనుష్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన వెంటనే కొడుకు లాంచ్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. సూపర్ స్టార్ వారసుడిగా ఎంట్రీ యాత్ర కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా, తండ్రి దర్శకత్వంలో కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే నిజమైతే, కోలీవుడ్‌లో మరో స్టార్ వారసుడి ఆరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టే..

