హైదరాబాద్: తండ్రి మృతిని తట్టుకోలేక కూతురు యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన గుజెట్టి శ్రీనివాస్ 2026, జూన్ 13న వడదెబ్బతో మృతి చెందాడు.
తండ్రి మృతిని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె గుజెట్టి ఊహశ్రీ సోమవారం (జూన్ 15) ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన తల్లి కళావతి, బంధువులు వెంటనే ఊహశ్రీని ఆసుపత్రికి గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో ఊహశ్రీ చికిత్స పొందుతోంది. ఊహశ్రీ కరీంనగర్లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి చనిపోయిన రెండు రోజులకే కూతురు ఆత్మహత్యాయత్నానికి గురైన బాధిత కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

