హంగేరీ, కజికిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో పెను ప్రమాదం తప్పింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్పైడర్ కెమెరా తీగలు తెగి మైదానంలో పడిపోయింది. దాదాపు 20 మీటర్ల ఎత్తు నుంచి అది మైదానంలో పడింది. ఆ పక్కనే కెమెరామెన్ ఉన్నాడు. అతడికి కాస్త దూరంలో స్పైడర్ కెమెరా పడిపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సరైన ఏర్పాట్లు చేయాలని ఫెడరేషన్పై చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఫుట్బాల్ ప్రపంచకప్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అభిమానులు వీసా వ్యవహారంలో ఫిఫా తీరుపై విమర్శలు=లు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటన జరగడంతో వరల్డ్ కప్ మ్యాచ్ల నిర్వహణ ఎలా ఉంటుందోనని అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రపంచకప్ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఘటన జరగాల్సి ఉంది.

