రామ్ చరణ్ క్షమాపణలు : తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ పాపులారిటిని సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…’త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని సృష్టించిన ఈ హీరో ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా భూపాల్ లో నిర్వహించిన ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొనడమే కాకుండా తన అభిమానులను సైతం కలుసుకున్నాడు. అలాగే ఈవెంట్ కి చాలామంది ప్రేక్షకులు వచ్చి ఈవెంట్ ని సక్సెస్ గా నిలిపారు. ఇక ఈ ఈవెంట్ లో యాంకర్ అడిగిన వారికి సమాధానం చెబుతూనే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయిన బుమ్రా ను ఫుట్ బాల్ ప్లేయర్ అంటూ మాట్లాడాడు. ఇక రామ్ చరణ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత తన తప్పును తెలుసుకొని బుమ్రా చాలా మంచి బౌలర్ నాకు పేర్లు సరిగ్గా గుర్తులేక తను ఫుట్ బాల్ ప్లేయర్ అని చెప్పను అంటే అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశాడు. అది చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ వ్యక్తిత్వం చాలా గొప్పదని చెప్పుకుంటున్నారు.
కొంతమంది హీరోలు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసుకొని సారీ చెప్పడం అనేది నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎవరూ కూడా ఇలాంటి మిస్టేక్ జరిగితే తొందరగా రెస్పాండ్ అయి సారీ చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు.
కానీ రామ్ చరణ్ ఈవెంట్ ముగిసిన వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అలా చెప్పాలంటే చాలా మెచ్యురిటీ ఉండాలి మనం స్టార్స్ అంటే గర్వం ఉండకూడదు… రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు కాబట్టే ఆయనను చాలా మంది ఇష్టపడతారు. రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది.
ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక బుచ్చిబాబు సైతం ఈ సినిమా నెక్ట్స్ లెవెల్లో నిలదొక్కుకోవడానికి చాలా కసరత్తులైతే చేశాడు. ఇక ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…
ఉఫ్… నేను కొన్నిసార్లు పేర్లతో నిజంగా మరచిపోతాను.
క్షమాపణలు @జస్ప్రీత్బుమ్రా93 మిక్స్-అప్ కోసం జీ – ఇది అన్ని ఉత్సాహం మరియు ప్రేక్షకుల మధ్యలో నిజమైన మానవ తప్పిదం
నేను నిన్ను నిజంగా గౌరవిస్తాను మరియు నేను మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తారు…
— రామ్ చరణ్ (@AlwaysRamCharan) మే 23, 2026

