టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ అంటే కేవలం నాలుగు పాటలు, మూడు సీన్లకే పరిమితమా? స్టార్ హీరోల పక్కన ఛాన్స్ వస్తే చాలు, క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా కేవలం రెమ్యునరేషన్ కోసమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలతో హీరోయిన్లపై ట్రోల్స్ చేసేవారికి కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘పెద్ది’లో జాన్వీ పాత్ర వివాదంపై ఆమె స్పందించిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. జాన్వీ పాత్రను చూపించిన విధానంలో తీవ్రమైన వల్గారిటీతో ఉందంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అటు గ్లామర్ పేరుతో తనను చూపించిన విధానంపై జాన్వీ కపూర్ కూడా డైరెక్ట్‌గా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే, నెటిజన్లు మాత్రం మరి అన్ని కోట్లు తీసుకుని ఎందుకు నటించావు? అంటూ జాన్వీపైనే నిందలు వేయడం మొదలుపెట్టారు.
సిస్టమ్‌ను మార్చండి.. నటిమణులను కాదు!
ఈ ఇష్యూపై ఆషికా రంగనాథ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా దృష్టిలో గ్లామర్ అంటే స్త్రీ సౌందర్యాన్ని అత్యంత హుందాగా, గౌరవప్రదంగా చూపించడం. అంతే తప్ప వల్గారిటీ కాదు. ఇక్కడ నటిమణులను బ్లేమ్ చేయడం ఆపండి. తప్పు రాసే రైటర్స్, తీసే మేకర్స్. ఇప్పటికీ ఇలాంటి సీన్లు పెడితేనే సినిమా అమ్ముడుపోతుందని నమ్ముతున్న ఇండస్ట్రీ సిస్టమ్‌ను ప్రశ్నించండి అంటూ కుండబద్దలు కొట్టారు.
►ఇంకా చదవండి | నయనతార రికార్డ్‌ను బ్రేక్ చేసిన రష్మిక.. సౌత్‌లోనే టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నేషనల్ క్రష్!
తప్పు మేకర్స్‌దే కానీ..
పెద్ద పాన్-ఇండియా సినిమాల్లో హీరోయిన్ నటించడం అనేది కేవలం నటన కోసమే కాదు, మార్కెట్లో తమ బ్రాండ్ వాల్యూను కాపాడుకోవడానికి చేసే స్ట్రాటజిక్ కాలిక్యులేషన్ అని చెప్పుకొచ్చారు ఆషిక. భారీ కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్ పాత్రలు కేవలం యాక్షన్ సీక్వెన్స్‌ల మధ్య వచ్చే గ్లామరస్ బ్రేక్స్ లాంటివి. హీరోయిన్ ఓన్ ఇమేజ్ కంటే హీరోను మరింత ఎలివేట్ చేయడానికే వాటిని డిజైన్ చేస్తారు. నటిమణులు వారికి వచ్చే అవకాశాలనే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. క్యారెక్టర్ సరిగ్గా రాయకపోతే ఆ తప్పు మేకర్స్‌దే కానీ, నటించిన మహిళలది కాదు అని ఆషికా చెప్పుకొచ్చారు.
అప్పట్లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సమయంలోనే గ్లామర్‌పై తన వాయిస్ వినిపించిన ఆషికా, ఇప్పుడు జాన్వీ కపూర్‌కు సపోర్ట్‌గా నిలిచారు. కమర్షియల్ సినిమాల మైండ్ సెట్ మారాలని, అప్పుడే హీరోయిన్ల పాత్రలకు గౌరవం దక్కుతుందని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి..

