ఆంధ్రప్రదేశ్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( వైఎస్ జగన్ మోహన్ రెడ్డి )అధ్యక్షతన మే 27న తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తారు.పార్టీకి చెందిన ముఖ్య నేతలు,నియోజకవర్గ ఇన్ఛార్జులు,కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహరచన, గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా,గ్రామస్థాయిలో పార్టీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి వెళ్లే అంశాలు,పార్టీ కార్యక్రమాల నిర్వహణ,సోషల్ మీడియా ప్రచారం,కేడర్ సమన్వయం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.

