తిరుమల: తిరుమలలో జనసేన పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీవారి ఆలయం దగ్గర “పవన్ కళ్యాణ్ అనే నేను” పుస్తకాన్ని ప్రదర్శించి వీడియో చిత్రీక రించారు జన సైనికులు. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి శ్రీవారి సన్నిధిలో జనసేన కార్యకర్తలు రీల్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో జనసైనికుల తీరుపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి శ్రీవారి సన్నిధిలో రీల్స్ చేసిన జనసైనికులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
►ఇంకా చదవండి | పెళ్లై ఇద్దరు పిల్లలు.. ఇన్ స్టాలో యువకుడితో పరిచయం.. ప్రియుడు కోసం భర్త హత్య.. సీన్ కట్ చేస్తే..!

