కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తారు భక్తులు. శనివారం ( జూన్ 13 ) తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూప్లెక్స్ బయట ఉన్న నారాయణగిరి షెడ్లలో క్యూ లైన్లు దాటి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు అక్కడ మేర దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ ఉచిత సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడతోందని..SSD టోకెన్ భక్తులకు పది గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఈ క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఒక్క రోజే 74వేల 636 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. 43వేల 84 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో రూ. 4.64 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు అధికారులు గుర్తించారు.

