ఆంధ్రప్రదేశ్:తిరుమల,తిరుపతిలో( తిరుపతి ) లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాల టార్గెట్ గా రెచ్చిపోతున్న దొంగలు.మొన్న ఇరవై లక్షలు.
తాజాగా వెయ్యి అమెరికన్ డాలర్లు మాయం.ఒకే హోటల్ లో రెండు ఘటనలపై అనుమానాలు.
ఇంటి దొంగల పనేనని అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు.మానస సరోవరం హోటల్,రూమ్ నెంబర్ 1017లో జరిగిన ఘటన.సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం.శ్రీవారి దర్శనానికి వెళ్లి,సాయంత్రం తిరిగి వచ్చి హోటల్ లాకర్ లో చూసుకోగా అందులో ఉంచిన 1000 డాలర్లు మాయం.
బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.ఇదే హోటల్ లో వారం క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి 20 లక్షలు చోరీ.

