ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని ప్రాంతంలో జ్ఞానేశ్వరి అనే బాలిక మిస్సింగ్ అయింది. ఈ సంఘటన జరిగి దాదాపు 15 రోజులు దాటింది. ఇంతవరకు ఆ బాలిక ఆచూకీ కనిపించలేదు. అనేక దఫాలుగా.. అనేక విధాలుగా అధికారులు ఆ పాప కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు ఆమె జాడ లభించలేదు. అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇంతవరకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.
ప్రత్యేకమైన బలగాలు.. ప్రత్యేకమైన బృందాల సహాయంతో గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు పాప జాడ కనిపించలేదు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాప మిస్సింగ్ అయినచోట చికెన్ ముక్కలు పెట్టారు. ఆట బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసినప్పటికీ పాప జాడ కనిపించలేదు.
పాప మిస్సింగ్ అయి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పాపను ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటే అప్పగించాలని.. వారిపై ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని పోలీసులు హామీ ఇచ్చారు. ఒకవేళ సమాచారం ఇచ్చినా సరే తాము నేరుగా వెళ్లి పాపను తీసుకొస్తామని చెప్పారు. పాపను ఆమె తల్లికి అందించడం తమలక్ష్యంగా పెట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అపహరణ కోణంలోనే కేసులు దర్యాప్తు చేస్తున్నామని.. మొబైల్ ఫోన్ అసలు ఉపయోగించని వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి కేసులో ఓ కారు గురించి చర్చ జరిగింది. కొంతమంది వ్యక్తులు వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఫేక్ ప్రచారమని పోలీసులు కొట్టిపారేశారు.
ఇన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టినప్పటికీ జ్ఞానేశ్వరి జాడ కనిపించింది.ప్రజలు ఆమెను అపహరించారు. పై ఆ పాపను వేరే తీసుకొని వెళ్లి ఉంటారని. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ పాప జాడ లభించడం లేదని పోలీసులు చెబుతున్నారు. అందుకే వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేయకుండా.. పాపను ఆమె తల్లి దగ్గరికి చేర్చుకుంటామని.. పాపను తీసుకెళ్లిన వారు తమకు సమాచారం ఇస్తే సరిపోతుందని పోలీసులు గుర్తించారు.

