దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ రబీ సీజన్లో కలిపి మొత్తం 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సేకరించిన ధాన్యానికి రూ.35 వేల కోట్లు చెల్లించామని చెప్పారు.
8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు సేకరించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఉత్తమ్ మండి పడ్డారు. గన్నీ బ్యాగ్స్ లేవని దుష్ప్రచారం అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల విమర్శలను తాము పట్టించుకోమని, రైతుల సంక్షేమం దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ అన్నారు.

