హైదరాబాద్: రాష్ట్రంలో 13 మంది ఐఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జారీ అయ్యాయి. చేనేత హస్తకళల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించిన ప్రభుత్వం.. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
జిఎడి (పొలిటికల్) ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌ను నియమించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సిఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన సంరక్షణ అధికారిగా వినయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది.
మరోవైపు సిఎంవొలోనూ కీలక మార్పులు జరిగాయి. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఎస్ఎస్ రామకృష్ణను సిఎం సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. సిఎంవొ ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సివోగా బదిలీ చేసింది. సిఎంవో ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌ను నియమించారు.

