నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై చర్చ జరిగే అవకాశం ఉంది. డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ సమావేశం చర్చించనుంది.
కీలక అంశాలివే…
జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంప్సెట్లకు ప్రోత్సాహంపై కేబినెట్ చర్చించనుంది. కొండారెడ్డిపల్లి తరహాలో సోలార్ విలేస్, సోలార్ స్టౌ స్కీం అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ శాఖల్లో ఈవీ వాహనాల వినియోగంపై కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ తీసుకోనుంది. పంటల మార్పిడి దిశగా రైతులకు యాక్షన్ ప్లాన్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాలు ఖరారు చేయనున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు.

