పవన్ కళ్యాణ్ వైరల్ వీడియో : కొన్ని సంఘటనలు మన హృదయాన్ని కలిపివేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఏమి తెలియని పసిబిడ్డలు , జీవితంలో ఎన్నో చూడాల్సిన పసిబిడ్డలు , మన కళ్ళ ముందే అంత చిక్కని ఆరోగ్య సమస్యలతో చనిపోతున్న సందర్భాలు చూసి , మన హృదయాలు విచారంతో నిండిపోయిన ఘటనలు గతం లో మనం ఎన్నో చూశాం. ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి బాధాకరమైన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రాంతం వరంగల్ వ్యాధికి చెందిన నిరంజన్ అనే కుర్రాడు , గుర్తు తెలియని తీవ్రమైన బాధ పడుతున్నాడు. ఇతని చివరి కోరిక , ప్రముఖ సినీ నటుడు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలవడం. రీసెంట్ గానే ఈ చిన్నారి ని రాధా మనోహర్ దాస్ స్వామిజీ కలిసాడు.
ఈ చిన్నారికి ధైర్యం చెప్తూ ‘పోకిరి సినిమా చూశావా ?, ఎప్పుడొచ్చాము అనేది ముఖ్యం కాదు అన్నయ్య , బుల్లెట్ దిగిందా లేదా?, అదే విధంగా ఎన్నాళ్ళు బ్రతికాము అనేది కాదు , ఏం చేశాము అనేదే ముఖ్యం’ అంటూ ఆ చిన్నారికి ధైర్యం చెప్పడం చాలా బాగా అనిపించింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని కలవడం ఆ చిన్నారి కోరిక అనే విషయం తెలుసుకున్న దాస్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ ని కలవాలా?, కలుస్తాడు , కానీ ఇక్కడ కాదు , నువ్వు హైదరాబాద్ కి రావాల్సి ఉంటుంది, ఇతను నిన్ను తీసుకొస్తాడు , నా ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేశాను , పాతిక వేలమంది చూశారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎన్నో చిన్నారుల కోరికలను తీర్చాడు. రాబోయే రోజుల్లో ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరితే ఆయన కచ్చితంగా ఈ చిన్నారిని కలుస్తాడని , ఆ చిన్నారిని హైదరాబాద్ కి రప్పించుకోవడం కాదు , స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి ఇంటికి వస్తాడని అభిమానులు అంటున్నారు. నెటిజెన్స్ చేత కంటతడి పెట్టిస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ప్రాణాంతక అనారోగ్యంతో పోరాడుతున్న వరంగల్‌కు చెందిన ఓ యువకుడికి చివరి కోరిక తీర్చుకుంది @పవన్ కళ్యాణ్ గారు
తన కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను ❤️@JSPS శతాగ్ని టీమ్ pic.twitter.com/1GD3fgsOB6
— సుప్రీం పవన్ కళ్యాణ్ FC™ (@SupremePSPK) జూన్ 14, 2026

