Telangana : తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19వతేదీ ఫిపా వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనుంది. ఆరోజు తెలంగాణలోని అన్ని బార్ల సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదివారం కావడంతో…
బార్లు ఈ నెల 19 వ తేదీ అదనపు వేళల్లో పనిచేసేందుకు అనుమతించబడింది. 20వ తేదీన వేకువ జామున 3 గంటల వరకూ బార్లు తెరిచి ఉంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. 19 వతేదీ ఆదివారం కావడంతో పెద్దయెత్తున మద్యం అమ్మకాలు జరిగే అవకాశముంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా లభించనుంది. అర్జెంటీనా, స్పెయిన్ జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.
వార్తల సారాంశం – మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది

