తెలంగాణ మహిళా సాధికారత పథకాలు: రాష్ట్ర మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 9 రోజులపాటు నిర్వహించిన ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నిర్వహించిన మహిళా వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అనసూయ (సీతక్క), ఇతర మంత్రులు, ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలోని మహిళా సంఘాల సభ్యులు, మహిళలతో సమీక్షించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం వివిధ వ్యాపార రంగాలలో, మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
ప్రచురించబడినది : 25 మే 2026 07:49 PM (IST)
కరీంనగర్ ఫోటో గ్యాలరీ
వ్యూ మోర్

