నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా విదేశీ ఉద్యోగ మేళాను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు నిజామాబాద్ ను వేదికగా నిర్ణయించింది. విదేశాల్లో కొలువుల కోసం ప్రయత్నిస్తున్న యువతీ, యువకులకు ఈ జాబ్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
జూలై 2న నిజామాబాద్లో…
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూలై 2న నిజామాబాద్లో భారీ విదేశీ ఉద్యోగ మేళా & మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జర్మనీ, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, యూఏఈ, కువైట్, ఒమాన్, ఖతర్, మలేషియా తదితర దేశాలతో పాటు దేశీయ కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరు ఈ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

