జనసేన హౌస్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు నిరాకరించింది. జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన నేతలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేశారు. అయితే ఈ పిటీషన్ విచారిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మరో పిటీషన్ వేశారు.
సభ ఏర్పాటుపై..
ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లో జనసేన సమావేశానికి ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.

