- నైరుతి రుతుపవనాలు జూన్ 5న రాయలసీమకు, 10న కోస్తాకు.
- ఏపీలో ఎండలు కొనసాగుతున్నాయి, ఐదు రోజులు ఉరుములతో వర్షాలు.
- తెలంగాణ వాతావరణం చల్లబడి, 18 జిల్లాలకు భారీ వర్ష సూచన.
తెలంగాణ AP వాతావరణ హెచ్చరిక జూన్ 2026: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భానుడి భగభగలతో ఊడిపోతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపుగా వేగంగా వస్తున్నాయి. గడిచిన వేసవి కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను చూసిన ప్రజలకు ఈ వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇవ్వనున్నాయి.
విశాఖ వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, నైరుతి రుతుపవనాల ప్రయాణం చాలా వేగంగా సాగుతోంది. జూన్ ఐదు రాయలసీమ ప్రాంతానికి ప్రవేశిస్తాయి. జూన్ 10న కోస్తాలోని అన్ని ప్రాంతాలకు దక్షిణ వర్షాలు విస్తరిస్తాయి.
ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత కొనసాగుతుండగానే, మరోవైపు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. కావలిలో 42.6 డిగ్రీ స్థాయి నమోదైంది. భీమిలిలో ఇప్పటికే రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని, కానీ ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో కూల్‌గా మారిన వెదర్
తెలంగాణలో కూడా ఒక్కసారిగా మారింది. నిన్నటి వరకు నిప్పులు కొలిమిలా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా చల్లబడింది. పలు చోట్ల వర్షపు జల్లులు కురిశాయి. తెలంగాణలోని మొత్తం 18 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటన.
వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి. దీనికి తోడు ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. దీని వల్ల గాలిలో తేమ పెరిగి వర్షాలు పడుతున్నాయి.
వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు జోరు వానలు పడతాయని చెబుతున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్ర తగ్గిన తర్వాత ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది పటాన్ చెరు, గచ్చిబౌలి, కూకట్పల్లి, మాదాపూర్, వంటి ఐటీ కారిడార్లలో సాయంత్రం వేళల్లో చిరు జల్లులు కురిశాయి.
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

