పర్సంటేజీ సిస్టమ్‌పై కొత్త నిబంధనల గురించి గత వారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుండి లేఖ వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్లో వరుస సమావేశాలు జరిగిన తర్వాత లేఖ బయటకు వచ్చింది. ఈరోజు తెలంగాణ ఎగ్జిబిటర్లు మధ్యాహ్నం విలేకరుల సమావేశం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పర్సంటేజీ విధానం అమలు చేయకుంటే పెద్ది విడుదల చేసేది లేదని స్పష్టం చేశారు. దీని తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు సంతకంతో కూడిన లేఖను విడుదల చేసింది.
ఇటీవలి సమావేశాల తర్వాత పర్సంటేజీ సిస్టమ్‌కు ఎగ్జిబిటర్లు అంగీకరించారని లేఖలో స్పష్టం చేశారు. జూన్ నెలాఖరులోగా లేదా తదుపరి పెద్ద సినిమా విడుదలకు ముందే తుది నిబంధనలను నిర్ణయిస్తామని లేఖలో స్పష్టం చేశారు. పర్సంటేజీ సిస్టం మోడల్‌పై చర్చలు జరుగుతున్నందున పెద్ది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వెల్లడించింది.

