భారత్ – ఆప్ఘనిస్తాన్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ కు విజయం దక్కే అవకాశాలున్నాయి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి అఫ్ఘనిస్తాన్ 18 పరుగులు చేశారు. భారత్ విధించిన ఫాలోఆన్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. ఏకైక ప్రదర్శనలో భారత్ పూర్తి ఆధిపత్యం కనపరుస్తుంది.
ఫాలో ఆన్ తర్వాత…
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 564 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయిన తర్వాత డిక్లెర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్గానిస్థాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ తో ఆప్ఘనిస్తాన్ మళ్లీ బ్యాటింగ్ చేసింది. భారీ ఆధిక్యంతో మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది.

