విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఎల్సీకే పురంలో అభివృద్ధి చెందిన రామాంజనేయులు కృష్ణవేణి నా కుమార్తె ఖండే చక్రిగా తోలుబొమ్మలాటలో కళాకారునిగా మంచి గుర్తింపు పొందుతోంది. అతి చిన్న వయసులోనే చదువుతోపాటు తోలుబొమ్మలాటలో కళాకారునిగా మంచి గుర్తింపు పొందడం శుభదాయకం. ఆరు సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రుల వద్ద ఈ సాంప్రదాయకళాకారునిగా నేర్చుకోవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు కూడా ఈ వృత్తిని అవలంబించడం వల్ల కర్ణాటక, తమిళనాడు, , ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. గత సంవత్సరాలుగా నిరంతరంగా ప్రదర్శనలు ఇస్తూ కళా నైపుణ్యం, ఆత్మవిశ్వాసము, క్రమశిక్షణతో సృజనాత్మకతతో పాటు భారతీయ సాంస్కృతిక వారసత్వం పై ఘాడమైన గౌరవాన్ని పెంపొందించుకున్నదని తల్లిదండ్రులు తెలిపారు. పదవ తరగతిని ధర్మవరంలోని కాకతీయ విద్యా నికేతన్ లో చదువుకొని, అక్కడ కూడా చదువులో మంచి ప్రతిభ కనపరచడం జరిగింది. అలాగే ప్రముఖుల నుండి ఆమె అభినందనలు కూడా అందుకోవడం జరిగింది. మహానాడు కార్యక్రమంలో రెండు రోజులపాటు తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అలాగే వివిధ సంస్థల ద్వారా అనేక అవార్డులను బహుమతులను సొంతం చేసుకుంది. ఇంకా తన వృత్తిని మరికొంతమంది చిన్నారులకు మార్గదర్శనం చేస్తూ వారికి నేర్పిస్తున్నది. ఈ వృత్తి అంతరించిపోకుండా భవిష్యత్తులో కూడా తాను తప్పక అందిస్తానని చక్రిగా నటించింది. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, అధికారులు అభినందనలు తెలియజేశారు.

