న్యూఢిల్లీ: దేశంలో త్రిభాషా విధానం అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ పంపారు. ఈ ఫార్మూలా అమలును జులై 1 నుంచి తప్పనిసరి చేయడంపై సీనియర్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. సిబిఎస్ఇ క్లాస్ 9, 10 విద్యార్థులకు ఈ త్రిభాషా సూత్రం వర్తింపు ఈ సంవత్సరం మధ్యలో తీసుకురావడం కుదరదని, నిలిపివేయాలని సూచించారు. విద్యా విషయాల పార్లమెంటరీ ప్యానెల్‌కు దిగ్విజయ్ సింగ్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఉన్నట్లుండి మిడిల్సెషన్లో తగు ఏర్పాట్లు లేకుండా నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది అవుతుందని లేఖలో తెలిపారు. సరైన సంఖ్యలో టీచర్లు లేరు.
పాఠ్య పుస్తకాలు రావు, వెనువెంటనే విద్యార్థుల మైండ్‌సెట్ మార్చేలా చేస్తే చిక్కులు ఏర్పడతాయి. ఇప్పటికే సిబిఎస్ఇ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌తో దెబ్బతిని ఉంది. ఇప్పుడు పిడుగు పడకుండా చూడాలని మరో అంశం. తనకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన వేడుకలను జతచేస్తున్నానని దిగ్విజయ్ సింగ్ తమ లేఖలో తెలిపారు. కేంద్రం ఇటీవల వెలువరించిన ప్రకటనలో విధిగా రెండు భారతీయ భాషల బోధన ఉండాలి. ఆంగ్ల భాషను విదేశీ భాషగా తీసుకున్నారు.
రెండు భారతీయ భాషలలో ఏ భాషలను ఎంచుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ సమయం, సరిపోని ఏర్పాట్ల నడుమ త్రిభాషా విధానం ఇప్పుడు వీలవుతుందా? అని కాంగ్రెస్ నేత నిలదీశారు. ఇక దేశంలో అత్యధిక శాతం స్కూళ్లలో విద్యార్థులకు బోధనకు సంబంధించిన భాషా మాధ్యమంగా ఇంగ్లీష్ ఉంది. ఆంగ్లంలోనే ఎక్కువగా పాఠశాలలు సాగుతున్నాయి ఈ భాష కేవలం విదేశీ భాషగా ప్రసిద్ది చెందింది.
ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ కేంద్రం నిర్ణయం. తక్కువ సమయం, అమలులో సవాలక్ష సమస్యలు తలెత్తే మార్పుతో విద్యార్థులు, మొత్తం మీద విద్యారంగంపై ప్రభావం పడుతుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కొన్ని కీలక నిర్ణయాలు జాతీయతా , ఇక్కడి భాషల ప్రోత్సాహం తీసుకోవచ్చు. అయితే వాస్తవికంగా , ఆచరణాత్మకంగా ఎదురయ్యే అవకాశాలను తెలుసుకోకపోతే, అమలుకు దిగితే విద్యార్థి దశ నుంచే యువత గందరగోళంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

