త్రిష: తమిళనాడు రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారయో ప్రతీ రోజు మనం సోషల్ మీడియా , టీవీల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. హీరో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సీఎం విజయ్ పెరంబూరుతో పాటు , తిరుచ్చి స్థానంలో పోటీ చేసి , రెండు స్థానాల్లో గెలుపొందారు. దీనితో రాజ్యాంగ నిబంధనల ప్రకారం , రెండిట్లో ఏదో ఒక స్థానానికి విజయ్ రాజీనామా చేయాలి. ఆ తర్వాత ఆ స్థానం లో ఉప ఎన్నికలు జరుగుతాయి. విజయ్ తిరుచ్చి వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సరిగ్గా అదే సమయం లో రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని ప్రకటన చేయడం తో , ఆయన TVK విజయ్ పార్టీ లో చేరి, తిరుచ్చి స్థానం నుండి పోటీ చేస్తారని సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరిగింది.
అయితే కంపెనీ లారెన్స్ క్లారిటీ ఇస్తూ నేడు ఒక వీడియో విడుదల చేయబడింది. ఈ వీడియో లో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని , తానూ తిరుచ్చి స్థానం నుండి పోటీ చేయబోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ త్రిష పేరు తెరమీదకు వచ్చింది. ఆమె TVK పార్టీ తరుపున తిరుచ్చి స్థానం నుండి పోటీ చేయబోతోందని , త్వరలోనే ఆమెని మనం ఉప ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియా లో విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా , తెరవెనుక TVK పార్టీ అంతర్గత కార్యక్రమాలను చూసుకుంటూ బిజీ గా ఉంటుంది. ఈ తిరుచ్చి స్థానం ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసి , రాజకీయ అరంగేట్రం చేయాలనీ , దీనివల్ల ఆమె ఉప ముఖ్యమంత్రిగా , లేదా క్యాబినెట్లో పవర్ ఫుల్ మంత్రిని సంపాదించుకునే అవకాశం ఉందని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ఈమధ్య ఊహించని పరిణామాలు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఈ వేళ , ఏదైనా జరగొచ్చు , త్రిష ని నిజంగానే ఉపముఖ్యమంత్రిగా చూడొచ్చేమో , ఎవరు వేయగలరు?, అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ , విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

