రామ్ చరణ్ నుంచి భారీ అంచనాల మధ్య వచ్చిన ‘పెద్ది’ థియేటర్లలో హవా నడిపిస్తుంది. ప్రస్తుతం ఏ థియేటర్లో చూసిన మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా బుధవారం రాత్రి పడిన ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం అభిమానుల్లో భారీ ఉత్సాహం. మరి ముఖ్యంగా, అభిమానులతో పాటు రామ్ చరణ్ భార్య సెలబ్రేషన్స్‌లో పాల్గొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల హైదరాబాదులోని శ్రీ రాములు థియేటర్లో స్పెషల్ ప్రీమియర్ షో చూసింది. తన తండ్రితో కలిసి వచ్చిన ఉపాసన, అభిమానులతో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. థియేటర్లోని ఫ్యాన్స్ జోష్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, కీలక సన్నివేశాల సమయంలో ప్రేక్షకులతో కలిసి కేరింతలు కొడుతూ ఆకట్టుకుంది.
కొణిదెల ఉపాసన పేపర్లు విసిరారు #రాంచరణ్ ప్రవేశం..…🔥🔥 #పెద్ది pic.twitter.com/PlatOA6F78
— సినీ వరల్డ్ (@Cinee_Worldd) జూన్ 3, 2026
ముఖ్యంగా రామ్ చరణ్ ఎంట్రీ సీన్స్‌కు చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ హంగామా చేసింది. ఇక కొన్ని సన్నివేశాలకు అయితే పేపర్ ముక్కలను సేకరించి, గాల్లోకి విసురుతూ థియేటర్లోని సంబరాలకు మరింత జోష్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#TFNE ఎక్స్‌క్లూజివ్: #ఉపాసన కొణిదెల చూసే పోస్ట్ పాప్ చేయబడింది #పెద్ది సినిమా 💚📷#రామ్ చరణ్ #తెలుగు ఫిల్మ్ నగర్ pic.twitter.com/imwxYkIZ4F
— తెలుగు ఫిల్మ్ నగర్ (@telugufilmnagar) జూన్ 4, 2026
ఇకపోతే ‘పెద్ది’లో రామ్ చరణ్ క్రాస్-అథ్లెట్ పాత్రలో కనిపించారు. క్రికెట్, రెజ్లింగ్, కుస్తీ, స్ప్రింటింగ్ వంటి క్రీడల్లో ప్రతిభ చూపే అతను చివరికి ఎలాంటి ఆదర్శమైన ప్రయాణం చేశాడనే ఓవరాల్ కథ. ఈ నేపథ్యంలో ‘పెద్ది’కి హిట్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం.
రామ్ చరణ్ నటనపై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పాత్ర కోసం ఆయన అంకితభావం, కష్టం తెరపై స్పష్టంగా కనిపించిందని, ఆ పాత్రకు తగిన ఫలితం దక్కిందంటూ అభినందనలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

