- పాకిస్థాన్‌లో ధురంధర్ 2 క్రేజ్..
- దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్..
- బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్‌గా ధురంధర్..
ధురంధర్ 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ”ధురంధర్: ది రివెంజ్” బాలీవుడ్‌తో పాటు భారత చలనచిత్ర రికార్డులను తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్‌గా మారింది. దర్శకుడు ఆదిత్య టేకింగ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్‌వర్క్‌లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది.
ఇదిలా ఉంటే, ధురంధర్ సినిమా పాకిస్తాన్ బ్యాన్ చేసింది. ఏ దేశమైతే బ్యాన్ చేసిందో, ఇప్పుడు ఆ దేశంలోనే సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ధురంధర్ 2 ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని పాక్ ప్రేక్షకులు కనిపించారు. ఇలా ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే పాకిస్థాన్‌లో నెంబర్1గా ధురంధర్ 2 ట్రెండ్ అవుతోంది. ఈ ట్రాఫిక్ ధాటికి ఏకంగా నెట్ఫ్లిక్ సర్వర్లు క్రాష్ అయినట్లు పాకిస్తాన్ కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో.. కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫరూకీ మాట్లాడుతూ..”’పాకిస్తాన్లో ‘ధురంధర్’ ఈరోజు విడుదలైంది, వెంటనే సర్వర్ క్రాష్ అయ్యింది. చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ధురంధర్2ను ”రా అండ్ అన్‌కట్” వెర్షన్‌ను అంతర్జాతీయంగా విడుదల చేసింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో, ‘ధురందర్’ డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కాగా, ‘ధురందర్ 2’ ఈ ఏడాది మార్చి 19న విడుదలైంది. ఇండియాలో జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సినిమా జూన్ 4న రానుంది. భారత్‌లో చాలా మంది ఈ సినిమా థియేటర్లలో చూశారు. ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్‌లో ఈ సినిమాపై క్రేజ్ ఆకాశాన్ని తాకింది.

