హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్సిఆర్ హెట్ఆర్డిలో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ పాలస్ షిపోకోసా మషటైల్ ప్రతినిధి బృందం సిఎం రేవంత్ తో భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావుతో పాటు ఉన్నారు.
దక్షిణాఫ్రికా – తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను, ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి రేవంత్ వారికి వివరించారు. భారత్లో అధికారిక పర్యటనలో భాగంగా మషటైల్ ప్యాకేజీని ప్రతినిధి బృందం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు తెలంగాణలో అధికారిక పర్యటనకు వచ్చిన మషటైల్ బృందానికి ముఖ్యమంత్రి ప్రత్యేక స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మషటైల్ మాట్లాడుతూ, “తెలంగాణలో మా ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ప్రభుత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతదేశంలోని అత్యంత యువ రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ, అతి తక్కువ కాలంలోనే భారత జాతీయ స్థూల దేశీయోత్పత్తి (GDP)కి అత్యధికంగా తోడ్పడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రజల పట్టుదల, సృజనాత్మకత, సంకల్పానికి ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు.
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య సంబంధాల విషయంలో చారిత్రక నేపథ్యాన్ని సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. సాంకేతికత, ఔషధ రంగం, వ్యాక్లు, రక్షణ, ఏరోస్పేస్, పరిశోధన, విద్య, ఆరోగ్యం, తయారీ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల రంగాలలో తెలంగాణ విశిష్ట ప్రతిభను కలిగి ఉంది. గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధి రంగాలలో తెలంగాణ వేగంగా సాగుతోందని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచే అవకాశాలు ఉన్నందున తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని దక్షిణాఫ్రికా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

