దర్శకులు హీరోలు కావడం ఇండస్ట్రీకి కొత్త కాదు. కాకపోతే సక్సెస్ అయినవాళ్లు తక్కువ. ఉదాహరణకు ఎస్వీ కృష్ణారెడ్డి మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు మేకప్ వేసుకుని కథానాయకుడయ్యారు. ఉగాది, అభిషేకం రెండూ దెబ్బేశాయి. దీనితో మళ్ళీ నటన జోలికి పోలేదు. కానీ డైరెక్టర్ గా మునుపటి వైభవం పూర్తిగా అందుకోలేకపోయారు. దాసరి నారాయణరావు లాంటి కొందరు మాత్రమే రెండు విభాగాల్లోనూ బలమైన ముద్ర వేసి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ వంతు వచ్చింది.
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందించిన డిసి ఆగస్ట్ 7 విడుదలకు రెడీ అయ్యింది. ఇందులో లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వామికా గబ్బి హీరోయిన్ గా అనిరుద్ సంగీత దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ట్రైలర్ కూడా వచ్చేసింది. తమను అన్యాయంగా వేధిస్తే ఎవరినైనా చంపడానికి వెనుకాడని దేవదాసు, చంద్ర ప్రేమకథగా దీన్ని ప్రదర్శించారు. మూడు నిమిషాల వీడియోలో ఫుల్ వయోలెన్స్ నింపేశారు.
చూడగానే వావ్ అనే ఫీలింగ్ లేదు కానీ ఏదో దాచే ప్రయత్నం చేసి అంచనాలు వచ్చేలా కష్టపడ్డారు. లోకేష్ డెబ్యూకే ఇంత ఇంటెన్స్ పాత్ర చేయడం ఆశ్చర్యం. అందులోనూ హింస ఎక్కువగా ఉండే ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ లో అనుభవమున్న నటినటులు అయితే బాగుంటుంది. వామికా గబ్బికి ఎక్స్ పీరియన్స్ ఉంది కానీ ఇప్పటి వరకు యాక్షన్ కెమెరా చెప్పిన లోకేష్ కు ఇప్పుడు వేరొకరి డైరెక్షన్ లో యాక్టింగ్ చేయడం కొత్త అనుభవం.
తెలుగులోనూ రిలీజవుతున్న డిసి డిసెంబర్ 7 కొరియన్ కనగరాజ్ తో పాటు పోటీ పడనుంది. ఒకవేళ లోకేష్ కనగరాజ్ కనక హీరోగా హిట్ కొడితే కొత్త కెరీర్ దక్కినట్టే. అయితే వెంటనే చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ తన చేతిలో ఉంది. రాక అయ్యాక బన్నీ దీని సెట్స్ లో అడుగు పెడతాడు. కూలి గాయం నుంచి బయట పడాలని చూస్తున్న లోకేష్ కనగరాజ్ కు ఐకాన్ స్టార్ సినిమా చాలా కీలకం.

