అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక వ్యాధులను తెచ్చిపెడుతోంది. ఈ చాలామంది ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎక్కువగా అవలంభించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా, తమ డైట్లో తాజా రసాలను చేర్చుకోవడం ఒక సాధారణ అలవాటుగా మారింది. ముఖ్యంగా దానిమ్మ రసం, బీట్రూట్ జ్యూస్ ని చేర్చుకుంటున్నారు. ఈ రెండూ వాటి ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందినవి. వీటిని తాగడం ద్వారా రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు దానిమ్మ రసం లేదా బీట్రూట్ జ్యూస్ ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ రసం
దానిమ్మ రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ పండులోని పొటాషియం, పాలిఫెనాల్స్ రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ రసం రక్త నాణ్యతను మెరుగుపరుస్తుంది. రక్తహీనత వంటి సమస్యలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి దానిమ్మ రసం ఒక మంచి ఎంపిక కావచ్చు. ఇది వాపును తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉంది.
బీట్రూట్ జ్యూస్
బీట్రూట్ జ్యూస్ ఐరన్, నైట్రేట్లు, ఫోలేట్లకు ఒక అద్భుతమైన మూలం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ ముఖ్యంగా అథ్లెట్లకు, జిమ్‌కు వెళ్లేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్రూట్ జ్యూస్ రక్తపోటు తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు పనితీరును పనితీరులో కూడా మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ కాలేయాన్ని డిటాక్స్ చేసి, శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచుతుంది.
ఏ జ్యూస్ బెస్ట్?
గుండె సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటే దానిమ్మ రసం మంచిది. ఇది క్రమంగా శరీరాన్ని బలపరుస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ఇక బీట్రూట్ జ్యూస్ అలసట, నీరసం, శక్తి లేకపోవడం, లేదా తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారికి మరింత ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.

