తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఈవెంట్లో మాజీ క్రికెటర్ మురళీ విజయ్ దినేశ్ కార్తీక్‌పై భావోద్వేగ ప్రశంసలు కురిపించారు. కార్తీక్ తమిళనాడు బెస్ట్ క్రికెటర్ అని, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో అతడి బ్యాటింగ్‌ను ఫ్యాన్‌లా ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. ఒకప్పుడు తన సహచర ఆటగాడిగా ఉన్న దినేశ్ కార్తీక్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నేను దినేష్ కార్తీక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది కాస్త వింతగా అనిపించవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి అతడిని చూస్తున్నాను. తమిళనాడు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్రికెటర్, బ్యాటర్, వికెట్ కీపర్లలో దినేశ్ కార్తీక్ ఒకరని నేను అనుకుంటున్నాను అని విజయ్ అన్నాడు. దినేశ్ కార్తీక్ మొదటి భార్యను విజయ్ పెళ్లాడాక వీరి మధ్య దశాబ్ద కాలంగా ఉన్న వివాదాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఒకప్పటి ప్రాణ స్నేహితులు, సహచరులు, ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో దూరమైన మురళీ విజయ్, దినేశ్ కార్తీక్‌ల మధ్య సయోధ్యకు సూచనగా ఓ అరుదైన ఘటన ఇది.

