ది ఒడిస్సీ బాక్స్ ఆఫీస్ : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం. నిన్నగాక మొన్ననే విడుదలైనట్టుగా అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద 7 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. కేవలం పశ్చిమ దేశాల్లోనే కాదు , ఇండియాలో కూడా సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లింది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందించే సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రం 7 వ ర్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 5 కోట్ల 76 లక్షల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఇప్పటి వరకు 85 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 112 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఈ వారం రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రం కేవలం నార్త్ అమెరికా నుండి 190 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీకెండ్ బలమైన హోల్డ్ ని కనబర్చగలిగితే అవతార్ 3 వరల్డ్ వైడ్ గ్రాస్ ని క్లోజింగ్ లో చాలా తేలికగా ఈ చిత్రం దాటగలదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ ని ఒకసారి పరిశీలిస్తే 330 మిలియన్ డాలర్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు , అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 3100 కోట్ల రూపాయల వరకు గ్రాస్ ఉంటుందని సమాచారం. ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ మార్కుని అణుడుంటుందనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 700 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది.
అయితే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మక 1 బిలియన్ క్లబ్ లో ఈ చిత్రం చోటు దక్కుతుందా లేదా అనే విషయం పై ఇప్పుడు సోషల్ మీడియా డిబేట్ లు నడుస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలకు లాంగ్ రన్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది కాబట్టి , కచ్చితంగా ఈ చిత్రం 1 బిలియన్ డాలర్లు వస్తుందనే బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు. కానీ ఈ నెల 31న స్పై డర్ మ్యాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ‘ది ఒడిస్సీ’ 1 బిలియన్ మార్కు అందుకోవడం అసాధ్యమే .

