ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది: పాపం ఏ ముహూర్తంలో నేచురల్ స్టార్ ‘ది ప్యారడైజ్’ మొదలు పెట్టాడో తెలియదు కానీ, ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాని చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రమిది. ఈ సినిమాకు ఆయన సహా నిర్మాతగా కూడా నటించాడు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్ వీడియో, ఆయా నుండి షేర్ పాటకు ఆడియన్స్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడా ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తోంది. ఇలా ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఎవ్వరును ఊహించనంత రేంజ్ కి వెళ్లిపోయాయి. ఒక స్టార్ హీరోకి ఎలాంటి అంచనాలు ఉంటాయో ఈ చిత్రం కూడా అలాంటి అంచనాలు ఏర్పడ్డాయి.
ముందుగా ఈ నెల 26న విడుదల చేద్దామని అనుకున్నారు , కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండటం , రీ షూటింగ్లు ఎక్కువగా జరుగుతుండడం వల్ల 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ రోజు కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని స్పష్టంగా నేడు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అదే రోజున రవితేజ ‘ఇరుముడి’ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ నేడు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ‘ది ప్యారడైజ్’ వాయిదా పడిందని అంటున్నారు విశ్లేషకులు. కొన్ని రోజుల క్రితమే ‘ది ప్యారడైజ్’ చిత్రం నాన్ స్టాప్ గా రీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది , ఈ సినిమా చెప్పిన సమయానికి విడుదల అవ్వడం కష్టం అని ఒక ఆర్టికల్ వస్తే , అదంతా ఫేక్ అని , ఆన్ టైం లోనే ఈ చిత్రం పూర్తి అవుతుందని , రీ షూటింగ్ జరగడం లేదని , ఆగస్టు 21 న ఈ సినిమా విడుదల అవుతుందని ఒక క్లారిటీ ఇచ్చింది.
అయితే ఇప్పుడు సడన్ గా ఈ ట్విస్ట్ వచ్చేలోపు ‘ది ప్యారడైజ్’ మరోసారి వాయిదా పడిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ వర్గాలను బట్టి చూస్తే , ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేసేలా ప్లాన్ లో ఉంది, అది కూడా కుదరకపోతే వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇక ఇరుముడి విషయానికి వస్తే ఈ చిత్రం నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి.

