తెలంగాణ:దేశంలోనే తొలి ఏఐ (Ai) ఆధారిత ఫిర్యాదు రికార్డర్ ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్‌ను హైదరాబాద్ లో సీపీ సజ్జనార్(సిపి సజ్జనార్, హైదరాబాద్) ఆవిష్కరించారు.ఈ యాప్ ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు.
చెప్పిన విషయాలు వెంటనే టెక్ట్స్‌గా మార్చి అనువదించే సదుపాయం ఉంది.ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో సేవ్ అవుతాయి.
వలస కార్మికులు,పర్యాటకులు,మహిళలు,వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.భాష న్యాయానికి అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో ఏఐని (AI)ఉపయోగిస్తున్నారు.
ముందుగా హైదరాబాద్‌లోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది.

