భారతదేశంలో MG కామెట్ EV ధర: భారతదేశంలో ప్రస్తుతం EV ల హవా సాగుతోంది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఈ వేరియంట్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలను ఆకట్టుకునేందుకు సరసమైన ధరలో కార్లు అందజేస్తాయి. వీటిలో MG Motors కంపెనీ నుంచి రిలీజ్ అయిన విద్యుత్ కారు అందరినీ ఆకర్షిస్తోంది. ఇతర కార్లకంటే దీని ధర బడ్జెట్ కు అనుగుణంగా దీని కోసం క్యూ కడుతున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే?
MG కంపెనీ నుంచి ‘కామెట్ EV’ 2023లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి పట్టణ ప్రయాణాలకు ఒక స్మార్ట్ ఎంపికగా నిలిచింది. గత ఏడాది ఈ ‘బ్యాటరీ యాజ్ సంస్థ ఎ సర్వీస్’ (BaaS) వేరియంట్‌ను పరిచయం చేయడం ద్వారా దీనిని మరింత అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా తన కోసం సుస్థిరాన్ని పొందింది. అయితే తాజాగా టాటా మోటార్స్ తన ‘Tiago.ev’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరింత తక్కువ ధరకే ప్రారంభించడంతో, ఈ పోటీ మరింత పెరిగింది.
అయితే ఈ కారులో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 41 bhp పవర్, 110 Nm టార్క్‌ను అందిస్తుంది. ARAI క్లెయిమ్ ప్రకారం.. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 230 పరిధిని అందిస్తుంది, ఇది రోజువారీ సిటీ ప్రయాణాలకు సరిపోయే ఈ కార ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అలాగే 3.3 kW ఛార్జర్‌తో సుమారు 7 గంటల్లో 0 100% ఛార్జ్ అవుతుంది.
ఈ బుజ్జి కారు కాంపాక్ట్ పరిమాణంలో ఉంటుంది. ఇందులో 10.25 డ్యూయల్ డిస్ప్లే సెటప్ ఉంది. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లాస్టర్గా పనిచేస్తుంది.వీటిలో పాటు ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్లు, డిజిటల్ కీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రత కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ABS విత్ EBD వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లను కూడా సంస్థ అందించింది.
MG కామెట్ EVకి సంబంధించి BaaS ప్రోగ్రామ్ కింద వినియోగదారులు కారును తక్కువ ధరకే కొనుగోలు చేసి, కిలోమీటరుకు రూ. 2.5 నుండి రూ. 3.2 మధ్య బ్యాటరీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీతో కలిపి లభించే వేరియంట్ల ధరలు సుమారు రూ. 7.35 లక్షల నుండి రూ. 7.63 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటాయి. 4-సీటర్ మైక్రో-EV పట్టణ ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లడానికి ఇది ఒక అద్భుతమైన వాహనం.

