– ప్రకటన –
ప్రభుత్వాల వైఫల్యం.. రెచ్చిపోతున్న లీక్ మాఫియా
భారత యువత భవిష్యత్తు ఆందోళనకరం
మానసిక ఒత్తిడిలో లక్ష లాది మంది విద్యార్థులు
నైతిక బాధ్యత విస్మరిస్తున్న ప్రభుత్వాలు
‘నీట్ లీకేజీ’ వ్యవహారంలో ఇలాగే మోడీ సర్కారు తీరు
తప్పుబడుతున్న మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు
కేంద్రంలోని మోడీ పాలనలో దేశంలో వ్యవస్థ పతనమై పరీక్షిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువతకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. తన బాధ్యతలను విస్మరిస్తోంది. పరీక్షా ప్రశ్నాపత్రాలు లీక్‌కాకుండా, పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతోంది. ఈ దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న నీట్, ఇతర పోటీల ప్రశ్నాప్రతాల లీకేజీ ప్రత్యక్షంగా మేధావులు, విద్యావేత్తలు చెబుతున్నారు. పరీక్షా వ్యవస్థ పతనంతో దేశ యువత మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చాలా మంది బలవన్మరణాలకూ చేస్తున్నారు. అయితే ఈ వైఫల్య ప్రభుత్వాలు బాధ్యత వహించి, తగిన చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత యువ దేశంగా అభివర్ణిస్తుంటారు. ఈ యువ జనాభానే దేశానికి అతిపెద్ద ఆస్తిగా చెప్తారు. అయితే నేడు అదే యువత పరీక్షల వ్యవస్థలో అవినీతి, పేపర్ లీకులు, నియామక ప్రక్రియ ఆలస్యం, నిరుద్యోగం కారణంగా తీవ్ర నిరాశ, ఆందోళన, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జాతీయ స్థాయి పరీక్షల నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యోగ నియామక పరీక్షల వరకు పేపర్ లీకులు వరుసగా వెలుగుచూస్తుండటం భారత పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
జాతీయ సంక్షోభంగా మారిన పరిస్థితి
గత కొన్నేండ్లుగా దేశంలో అనేక పోటీ పరీక్షలు పేపర్ లీక్‌ల బారిన పడ్డాయి. ప్రతిష్టాత్మక నీట్, యూజీసీ-నెట్, రైల్వే నియామక పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలు, టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షలు (టెట్), రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు ఇలా అనేక పరీక్షల్లో అవకతవకలు బయటపడ్డాయి. ఇది కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదనీ, కోట్ల రూపాయల టర్నోవర్‌తో నడుస్తున్న ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యమయ్యే ముద్రణ సంస్థలు, ప్రయివేటు పరీక్షా కేంద్రాలు, మధ్యవర్తులు, కొందరు అధికారుల మధ్య ఏర్పడిన అక్రమ నెట్వర్క్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
1.7 కోట్ల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మీడియా నివేదిక ప్రకారం.. మోడీ పాలనలో దేశవ్యాప్తంగా 70కి పైగా ప్రధాన పరీక్షల్లో పేపర్ లీక్‌లు, ఇతర అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటి ప్రభావం సుమారు 1.7 కోట్ల మంది అభ్యర్థులపై పడింది. పరీక్షలకు సిద్ధం కావడానికి విద్యార్థులు సంవత్సరాల సమయాన్ని, కుటుంబాలు లక్షల రూపాయలను ఖర్చు చేస్తాయి. కానీ పరీక్ష రాద్దయిన క్షణంలో ఆ శ్రమ, సమయం, డబ్బు అన్నీ వృథా అవుతున్నాయి. దీనితో అభ్యర్థులు, వారి కుటుంబీకులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
బాధ్యత ఎవరిది?
పరీక్షల్లో అవకతవకలు బయటపడినప్పుడు సాధారణంగా పరీక్షలను రద్దు చేయడం, దర్యాప్తునకు ఆదేశించడం, కొందరు మధ్యవర్తులను అరెస్టు చేయడం జరుగుతోంది. కానీ వ్యవస్థ వైఫల్యానికి బాధ్యత వహిస్తుంది కానీ, నిర్ణయాధికారులు కానీ, సంబంధిత సంబంధిత మంత్రులు కానీ తమ పదవులకు రాజీనామా చేసిన సందర్భాలు మోడీ పాలనలో కనిపించడం లేదు. ఇది ప్రభుత్వానికి నైతిక విలువలు తగ్గడానికి ప్రత్యక్షంగా ఉదాహరణగా చెప్పొచ్చని విశ్లేషకులు అంటున్నారు. పరీక్షల నిర్వహణ సంస్థలు, రాష్ట్ర నియామక నియామకాలు, కేంద్ర సంస్థల పరస్పర బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయని చెప్తున్నారు. దీంతో విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్త పరీక్షల తేదీల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
పరీక్షా వ్యవస్థలోని అనిశ్చితి యువతలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు సాధారణంగా వ్యక్తి జీవితంలో అత్యంత ఉత్పాదక దశగా భావిస్తారు. కానీ భారత యువతలో చాలా మంది ఈ కాలాన్ని పోటీ పరీక్షల కోసమే గడుపుతున్నారు. ఏండ్ల తరబడి చదివి, పరీక్ష రాసిన తర్వాత అది పేపర్ లీక్ కారణంగా రద్దయితే విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల అంచనాలు, సమాజ ఒత్తిడి కూడా దీనిని మరింత తీవ్రం చేస్తోంది.
విద్యార్ధుల ఆత్మహత్యలు
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా విద్యార్థుల ఆత్మహత్యలను ‘సంస్థాగత సంక్షోభం’గా అభివర్ణించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరం 13 వేల మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే రోజుకు సగటున 35 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. పేపర్ లీక్‌లు, పరీక్షల రద్దు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై విమర్శలు
నీట్ పరీక్ష లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. జాతీయ పరీక్షా (ఎన్టీఏ) సంస్థ నిర్వహించిన కొన్ని ప్రధాన పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు వచ్చినప్పటికీ, మోడీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించకపోవడం శోచనీయమని ప్రతిప క్షాలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ.. కేంద్రం తన వైఫల్యాన్ని పూర్తిగా అంగీకరించకపోవడం.
సంస్కరణలు అవసరం
విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలలో నెలకొన్న ఈ అనైతిక, అక్రమాలకు చెక్ పెట్టాలంటే పటిష్ట వ్యవస్థ దేశంలో అవసరమని మేధావులు, విశ్లేషకులు చెబుతున్నారు. స్వతంత్ర జాతీయ పరీక్ష భద్రతా సంస్థ ఏర్పాటు చేయబడ్డారు. పేపర్ లీక్ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అంటున్నారు. పరీక్షలు రాద్దయితే అభ్యర్థులకు ఆర్థిక పరిహారం ప్రకటించాలని అంటున్నారు. నియామక ప్రక్రియలకు నిర్దిష్ట కాలపరిమితి అవసరమని చెప్పారు. పోటీ పరీక్షలకు మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అభ్యర్థులు సూచిస్తున్నారు. పరీక్షా ప్రక్రియ మొత్తంలో సాంకేతిక భద్రత, పారదర్శకత పెంపు జరగాలని వారు అంటున్నారు. భారతదేశం నిజంగా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే యువతపై నమ్మకం పెంచే పరీక్షా వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని మేధావులు అంటున్నారు. పేపర్ లీక్‌లు, అవినీతి, ఆలస్యాలు కొనసాగితే ప్రభుత్వ సంస్థలపై యువత విశ్వాసం మరింత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
– ప్రకటన –

